JAISW News Telugu

Actress Sreeleea : ఆఫర్స్ లేక ఆ పని చేస్తున్న శ్రీలీల.. పాపకు ఎంత కష్టమొచ్చిందంటున్న నెటిజన్లు

Actress Sreeleea

Actress Sreeleea

Actress Sreeleea : గతేడాది శ్రీలీల ఒక ఊపు ఊపిందనే చెప్పాలి. అందం, అభినయమే కాదు మంచి డ్యాన్సర్ కూడా కావడంతో యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల దాక ఆమెకే ఫస్ట్ చాయిస్ ఇచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే గతేడాది అందరు హీరోయిన్ల కన్నా ఆమె సినిమాలే ఎక్కువ. పెళ్లి సందడి మూవీతో తెరంగేట్రం చేసిన శ్రీలీలకు వరుస ఆఫర్స్ వచ్చాయి. ఈ అమ్మడి అందానికి యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇక ఈ మధ్య హాట్ హాట్ ఫొటో షూట్ లతో యూత్ లో హీట్ పెంచుతోంది ఈ భామ. అయితే తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈమధ్య కాలంలో శ్రీలీల నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం ప్లాప్స్ కావడంతో ఐరన్ లెగ్ ముద్రపడిపోయింది. దీంతో అమ్మడికి ఆఫర్స్ రావడం బాగా తగ్గినట్లు తెలుస్తోంది. సినిమా అంటేనే సెంటిమెంట్లు ఎక్కువ. ఇటువంటి వాటికి సినిమా వాళ్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తారు కాబట్టి సెంటిమెంటల్ గానే ఉంటారు. ఇదే పాపం శ్రీలీల విషయంలో ప్రతికూలంగా మారుతోందని తెలుస్తోంది. వాస్తవానికి ఆ సినిమా ఫలితాల్లో శ్రీలీలకు ఏమాత్రం సంబంధం లేదు. తన వరకు తాను బాగా నటించినా, డ్యాన్సు లు చేసినా, అందాలు ఆరబోసినా.. ఆ సినిమాల్లో దమ్ము లేకపోవడంతో అవి ప్లాప్ అయ్యాయి. కానీ వాటి ప్రభావం శ్రీలీల బాగానే పడినట్టు తెలుస్తోంది.

గత ఆరు నెలల నుంచి శ్రీలీలకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు. దీంతో శ్రీలీల టైంపాస్ కోసం జిమ్ కు వెళ్లి వర్కౌట్ చేయడం, స్టడీస్ పై కాన్సంట్రేషన్ పెట్టడం, ఫ్రెండ్స్ తో చిల్ అవడం చేస్తోందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాపం శ్రీలీలకు ఎంత కష్టమొచ్చింది అంటూ నెటిజన్స్ ట్వీట్ చేస్తున్నారు.

Exit mobile version