Actress Jethwani : నటి జెత్వానీ కేసు.. వైసీపీ నేత విద్యాసాగర్ కు రిమాండ్

Actress Jethwani Case Vidhya sagar Remand
Actress Jethwani Case : ముంబై నటి జెత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కు న్యాయమూర్తి 4వ తేదీ రిమాండ్ విధించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు. డెహ్రాడూన్ నుంచి నిన్న (ఆదివారం) రాత్రి రైలులో విజయవాడకు తీసుకొచ్చారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి మెడికల్ టెస్టులు చేయించారు. అనంతరం సోమవారం తెల్లవారు జామున న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నిందితుడికి వచ్చే నెల 4 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో విద్యాసాగర్ ను పోలీసులు జైలుకు తరలించారు.
ఏపీలో సంచలనంగా మారిన ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాదంబరి కేసు వ్యవహారి వెలుగులోకి వచ్చాక విద్యాసాగర్ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్ని ర్ోజులు ముంబైలో, మరికొన్ని రోజులు ఢిల్లీలో తలదాచుకున్నారని పోలీసులు గుర్తించారు. చివరకు డెహ్రాడూన్ లోని ఓ రిసార్ట్ వద్ద విద్యాసాగర్ ను అరెస్టు చేశారు. అక్కడి మూడో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చిన అనంతరం ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడకు తీసుకువచ్చారు.