Eesha Rebba : నటి ఈషా రెబ్బ సెన్సెషనల్ కామెంట్స్..  ఆ సమయంలో తప్పక నటించాల్సిందే

Eesha Rebba

Eesha Rebba

Eesha Rebba : తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది హిరోయిన్లు ఎక్కువ కాలం సినిమాల్లో రాణించలేకపోతుంటారు. అయితే అందివచ్చిన అవకాశాలను ఈషా రెబ్బ సద్వినియోగం చేసుకుంటోంది. చాలా సినిమాల్లో సెకండ్ హిరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లో మెయిన్ హిరోయిన్ గా చేసింది. అయితే చాలా రోజులుగా ఆమె సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.

ఈషా రెబ్బ తెలుగులో అంతకుముందు ఆ తర్వాత అనే సినిమాతో పరిచయమైంది. ఆమె ఫేస్ బుక్ లో పెట్టిన పిక్స్ ను చూసి డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ మొదటి సారి చాన్స్ ఇచ్చారు. ఈషా రెబ్బ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మాకు నచ్చిన సమయంలో షూటింగ్ నుంచి వెళ్లిపోవడానికి వీల్లేదు. పీరియడ్స్ ఉన్నా సరే షూటింగ్ లో పాల్గొనాల్సిందే. కొంతమంది డైరెక్టర్లు మా నొప్పిని అర్థం చేసుకుని టైం ఇస్తుంటారు. కానీ కొంతమంది ఇవ్వరు.

అయినా షూటింగ్ లో మాకు ఎంత ఇబ్బంది ఉన్నా పూర్తి చేస్తాం. దీని కోసం పెయిన్ కిల్లర్లు వాడతామని కుండ బద్దలు కొట్టింది. ఈషా రెబ్బ చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈషా నటించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సిరీస్ తోనే ఆమె ఎంతో పేరు సంపాదించుకుంది. ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత లో సెకండ్ హిరోయిన్ గా నటించింది.

ఇలా దాాదాపు పాతిక సినిమాల వరకు చేసింది. అయినా ఇప్పటి వరకు భారీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఈషా రెబ్బ నటించిన చాలా మూవీస్ కంటెంట్ ఉన్న సినిమాలే. కానీ అవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు రావడం లేదు. కానీ ఈ ముద్దుగుమ్మ స్త్రీల గురించి మాట్లాడిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. స్త్రీలు పీరియడ్స్ టైంలో పడే బాధను హిరోయిన్ గా  అందరికీ అర్థమయ్యేలా చెప్పింది.

 

View this post on Instagram

 

A post shared by Eesha Rebba (@yourseesha)

TAGS