Chiranjeevi – Amani : ఆమని కుటుంబ కథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి. తెలుగులో శుభలగ్నం మూవీలో ఏమిటో అనే డైలాగ్ ఎంతో పేరు సంపాదించి పెట్టింది. అనంతరం మావిచిగురు, జంబలకిడిపంబ, మిస్టర్ పెళ్లాం. వంశానికొక్కడు, శుభసంకల్పం లాంటి మూవీల్లో నటించి ప్రత్యేకత చాటుకుంది.
ఆమని ముస్లిం వ్యక్తి ఖాజా మొయినోద్దీన్ ను వివాహం చేసుకుంది. అంతా అనుకున్నట్లుగా వీరిది ప్రేమ వివాహం కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కాదని కేవలం వీరి పర్సనల్ ఓపీనియన్స్ కలవడంతోనే పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉండగా.. ప్రస్తుతం ఆమని ఆమని తన భర్తతో విడిపోయారు.
ఆమని ప్రస్తుతం అనేక మూవీల్లో మంచి క్యారెక్టర్లు చేస్తూ మళ్లీ సెకండ్ ఇన్సింగ్స్ ఆరంభించింది. అయితే కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, బాలకృష్ణ లాంటి అగ్రహిరోల సరసన నటించిన ఆమని చిరంజీవి సరసన నటించే అవకాశం రాలేదని బాధపడుతోంది. ఈ మధ్య ఒక ఇంటర్య్వూలో ఈ విషయాన్ని బయటపెట్టింది. చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. తనకు ఆయన పక్కన హిరోయిన్ గా నటించాలని చాలా కోరికగా ఉండేది. రొమాన్స్ సీన్ ఏదైనా చిరంజీవిని ఊహించుకునే దాన్ని.. అలాంటిది చిరంజీవితో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది. రిక్షావోడు మూవీలో సౌందర్యతో పాటు ఆమని హిరోయిన్ అని చెప్పారు. డేట్స్ కూడా ఫిక్స్ చేశారు.
అయితే అనుకున్నది ఒకటి అయిందొకటి ఈ మూవీలో నగ్మాను సెలెక్ట్ చేసి ఆమనిని తీసేశారని తెలిసింది. దీంతో మేనేజర్ తో మాట్లాడితే ఆ సినిమాకు డైరెక్టర్ మారారని కోదండరామిరెడ్డి బదులు, కోడి రామకృష్ణ డైరెక్షన్ చేస్తున్నారని చెప్పడంతో అక్కడ అవకాశం కోల్పోయానని కన్నీరు పెట్టుకుంది ఆమని. అయితే స్టాలిన్ లో చిరంజీవికి చెల్లెలి పాత్ర చేయాలని మొదట తననే సంప్రదించారని కానీ చిరంజీవి పక్కన హిరోయిన్ గా చేయాలనే డ్రీమ్ తో బతికినా.. అందుకే ఆ పాత్రను రిజక్ట్ చేశానని ఆమని చెప్పుకొచ్చింది. చివరకు చిరంజీవితో ఒక్క ఫొటో దిగే అవకాశం వచ్చిందని అభిమానిగా దాన్ని నేను పదిలంగా దాచుకున్నానని చెప్పింది.