Actor Nassar : వెయిటర్ గా పనిచేసిన నాజర్.. చిరంజీవికి తెలియగానే ఏం చేశాడంటే
Actor Nassar : విలక్షణ నటుడు నాజర్ తన సినీ కెరీర్ ఆరంభంలో ఎన్నో అష్టకష్టాలు పడ్డారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సరైన అవకాశాలు రాని సమయంలో పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఫిల్మ్ ఇన్సిస్టిట్యూట్ లో శిక్షణ పూర్తయిన తర్వాత కొన్ని రోజుల వరకు అవకాశాలు రాకపోవడంతో కోరమండల్ తాజ్ హోటళ్లలో వెయిటర్ గా పనిచేసినట్లు ఆ ఇంటర్వ్యూలో నాజర్ తెలిపారు.
నాజర్, చిరంజీవి ఇద్దరు కలిసి ఫిల్మ్ ఇన్సిస్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. చిరంజీవికి ఎక్కువ అవకాశాలు రాగా.. సూపర్ స్టార్ గా ఎదిగిపోయారు. కొన్ని కొన్ని చిన్న షూటింగ్ లకు వీరు కలిసి వెళ్లేవారు. పొద్దున నాజర్ వాళ్ల అమ్మ వంట పూర్తి కాకపోవడంతో కొన్ని సార్లు కేవలం అన్నం బాక్సు మాత్రమే పెట్టుకుని వెళ్లేవాడినని నాజర్ చెప్పాడు. చిరంజీవి, ఇతర నటులకు ఆంధ్ర మెస్ నుంచి భోజనం వచ్చేది.
ఇది చూసిన చిరంజీవి నువ్వు కూడా మాతో భోజనం చేయమని చెప్పాడని నాజర్ గుర్తు చేసుకున్నాడు. అలా చిరంజీవి తో షూటింగ్ ఉన్నన్నీ రోజులు అక్కడే వారితో పాటు భోజనం చేసే అవకాశం కలిగింది. ఫిలిం చాంబర్ నుంచి కోరమండల్ తాజ్ హోటల్ వరకు కేవలం ఒక్క కిలోమీటర్ మాత్రమే ఉండేది. అక్కడ షూటింగ్ జరుగుతుందని తెలిసి నాజర్ వెళితే.. చిరంజీవి షూటింగ్ లో ఉన్నారు. నాజర్ ను చూసి చిరంజీవి రమ్మని పిలిచి ఏం చేస్తున్నావని అడిగాడంటా.. ప్రస్తుతం హోటళ్లో వెయిటర్ గా చేస్తున్నానని నాజర్ చెప్పడంతో ఇంత మంచి నటుడువి.. వెయిటర్ గా చేయడం ఏంటీ రేపు ఉదయం వచ్చి కలువు అని చిరంజీవి నాజర్ కు చెప్పాడంట.
కానీ ఆత్మాభిమానం అడ్డు వచ్చి నాజర్ చిరంజీవి వద్దకు వెళ్లకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత నాజర్ కు స్టార్ డైరెక్టర్ బాలచందర్ మూవీలో అవకాశాలు రావడం, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా మారిపోయాడంట.. ఇలా తాను వెయిటర్ నుంచి ఈ స్థాయి వరకు ఎదిగానని నాజర్ చెప్పుకొచ్చాడు.