Nana Patekar : కార్గిల్ యుద్ధ సమయంలో నటుడు నానా పటేకర్ అన్ టోల్డ్ స్టోరీస్.. వైరల్
Nana Patekar : బాలీవుడ్ నటీనటులు తరచూ భారతీయ సైన్యానికి మద్దతుగా అద్భుతమైన సినిమాలు తీసి వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. అయితే ప్రముఖ నటుడు నానా పటేకర్ నిజ జీవితంలోనూ భారత ఆర్మీకి వెన్నుదన్నుగా నిలబడి ఆదర్శంగా నిలిచాడు. 2024 కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా, 1999 కార్గిల్ యుద్ధంలో నానా పటేకర్ స్ఫూర్తిదాయకమైన పాత్ర తాజాగా వెలుగులోకి వచ్చింది.
తిరంగా, వెల్‌కమ్ , క్రాంతివీర్ వంటి చిత్రాలలో నటించిన ప్రముఖ నటుడు నానా పటేకర్ క్విక్ రియాక్షన్ టీమ్ (క్యూఆర్‌టి) సభ్యునిగా ఇండియన్ ఆర్మీతో పాటు పనిచేశాడు. క్యూఆర్‌టిలు ఎలైట్ మిలిటరీ యూనిట్‌లు, అత్యవసర పరిస్థితులకు వేగంగా స్పందించడానికి శిక్షణ -భద్రత -నిఘా వంటి కీలకమైన సహాయాన్ని అందిస్తాయి.
నటుడు నానా పటేకర్ కార్గిల్ యుద్ధ సమయంలో చేసిన సేవ గురించి తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ వద్ద పంచుకున్నారు. నానా పటేకర్ మాట్లాడుతూ “ఇత్నా సా తో కుచ్ హమ్ కర్ సక్తే హై దేశ్ కే లియే (కనీసం మనం దేశం కోసం దీన్నైనా చేయగలం).” కదా అని తెలిపారు. కార్గిల్ యుద్ధ సమయంలో మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లోని సైనికులతో రెండు వారాలు గడిపి వారికి సాయం చేశానని తెలిపారు.
నానా పటేకర్ సైనిక సంబంధాలు 1990 నుంచే ఉన్నాయి. ఆయన దర్శకత్వం వహించిన ప్రహార్ కోసం కఠినమైన శిక్షణ పొందాడు. ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ కెప్టెన్ హోదాను అందుకోవడంతో సైన్యంలో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఈ చిత్రంలో, అతను జనరల్ వికె సింగ్‌తో సహా ప్రముఖ ఆర్మీ సిబ్బందితో కలిసి పనిచేసే మేజర్ ప్రతాప్ చౌహాన్ పాత్రను పోషించాడు.
నానా పటేకర్ నిజ జీవిత దేశభక్తి, తెరపై , వెలుపల కూడా దేశం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనంగా చెప్పొచ్చు.