Puri Jagannath : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై చర్యలు తీసుకోవాలి : బీఆర్ఎస్ నాయకులు

Puri Jagannath
Puri Jagannath : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు రజితారెడ్డి, గర్రెపల్లి సతీశ్ బుధవారం ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కు ఫిర్యాదు చేశారు. పూరీ జగన్నాథ్ తీసిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని ఓ ఐటం సాంగ్ లో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మాటలను వాడి యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేశారని పేర్కొన్నారు.
ఇటీవల ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ నుంచి రిలీజైన ‘మార్ ముంత చోడ్ చింత’ అనే పాటలో వాడిన కేసీఆర్ మాటలను వెంటనే తొలగించాలని లేకుంటే పూరీ జగన్నాథ్ ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కనీస విలువలతో సినిమాలు తీయాలని డైరెక్టర్ కు సూచించారు. పూరీ జగన్నాథ్ పై కేసు నమోదు చేయాలని డీసీపీకి విజ్ఞప్తి చేశారు.