Minister Sridhar Babu : జూన్ 6 తర్వాత పేదలకు ఇండ్లపై కార్యాచరణ: మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu : జూన్ 6 తర్వాత ఇండ్లు లేని పేదలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేపడతామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి మేడగడ్డ బ్యారేజీ కూలిపోతే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని.. కూలుతూనే ఉంటాయి.. నడుస్తూనే ఉంటాయని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకంగా నిర్మించడంతోనే మేడిగడ్డ కూలుతుందని మంత్రి ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహాలక్ష్మీ పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం.. రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు పథకం, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, చేయూత పథకం ద్వారా నెలకు రూ. 4 వేల పింఛన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్ ను రూ.10 లక్షల వరకు పెంచడం, గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా వంటి పథకాలను ప్రకటించింది. వాటిలో రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తోంది. మిగతా పథకాల అమలుపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాయి.