Mudragada Padmanabham : సినిమాలో నటించు.. రాజకీయాల్లో కాదు: ముద్రగడ పద్మనాభం

Mudragada Padmanabham
Mudragada Padmanabham : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీరియస్ అయ్యారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదని హితవు పలికారు.
ముద్రగడ పద్మనాభం సోమవారం మీడియాతో మాట్లాడుతూ తాను ఏనాడూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదన్నారు. ఇంట్లో ఉన్న నన్ను పవన్ రోడ్డు మీదకు లాగారని, హైదరాబాద్ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చు పెట్టాడని ఆరోపించారు. ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడని అన్నారు. మీరు వదిలేసిన ఇద్దరు భార్యలను, ఇప్పు కలుసున్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదు..? అని ప్రశ్నించారు.
‘‘పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాలలో కాదు. నాకూ నా కుమార్తెకే బంధాలు తెగిపోయాయి అని ఆమె భర్త, మామకు చెబుతున్నాను. వీలైతే ఆమెను టీవీ డిబెట్లు, జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని వారిని కోరుతున్నాను’’ అంటూ ముద్రగడ వ్యాఖ్యలు చేశారు.