murder cases : మూడు హత్యల కేసులో నిందితుల అరెస్టు

murder cases
murder cases : కాకినాడ జిల్లా కాజులూరు మండలం శలపాకలో మూడు హత్యల కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు వెల్లడించిన వివరాల ప్రకారం.. శెలపాకలో గత నెల 31న రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. చిన్నయ్య, రమేశ్, రాజు అనే వ్యక్తులను పొట్లకాయ నాగేశ్వరరావు, అతని కుటుంబం అతి కిరాతకంగా హత్య చేశారు. ఇనుప రాడ్లు, మంచం కోళ్లతో దాడి చేశారు. కాపాడటానికి వెళ్లిన బాధిత కుటుంబ సభ్యుడు శ్రీను పైనా దాడి చేయగా అతడు తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.