
CM Jagan Attack Accused Arrested
CM Jagan : సిఎం జగన్ పై రాయి దాడి కేసులో సతీశ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సతీశ్ ఏ1గా ఉన్నాడు. సతీశ్ కు వైద్య పరీక్షలు పూర్తి చేసి, విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి దుర్గారావు అనే వ్యక్తి సహకరించినట్లు సమాచారం. మొత్తం ఐదుగురు అనుమానితులను పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది.
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో శనివారం రాత్రి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో సిఎం జగన్ పై రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు సతీశ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.