CM’s convoy : సీఎం కాన్వాయ్ కు ప్రమాదం.. అసలేం జరిగిందంటే?.

CM's convoy

CM’s convoy

Kerala CM’s convoy : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలో సీఎం కాన్వాయ్ వస్తే ఎక్కడపడితే అక్కడ రోడ్ల మీద ప్రయాణికుల వాహనాలు ఆపాల్సిందే. రోడ్లన్నీ క్లియర్ చేసి సీఎం కాన్వాయ్ వెళ్లిన తర్వాతనే మిగతా వాహనాల్ని పంపిస్తారు. ఇలా చేసే సమయంలో ఇతర ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. గంటల తరబడి ట్రాఫిక్ లో వెయిట్ చేసి నానా అవస్థలు ఎదుర్కొంటారు.

అయితే కేరళలో సీఎం కాన్వాయ్ పోతున్న సమయంలో ఎక్కడి వాహనాలు, సామాన్య ప్రజలు వారి పని వారు చేసుకుంటున్నారు. ఈ కాన్వాయ్ తో సామాన్యులకు ఇబ్బంది కలగకూడదని అక్కడి సీఎం ఆలోచన. దాని కనుగుణంగానే సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్ల మీద అలా సాగి వెళ్లిపోతుంటారు.

కాగా కేరళలో సీఎం కాన్వాయ్ వెళుతుండగా రోడ్డుపై సడెన్ గా ఓ మహిళ అడ్డు వచ్చింది. దీంతో వెంటనే ఆ మహిళ ను కాపాడేందుకు సడెన్ బ్రేక్ వేశారు. మహిళ ప్రమాదం నుంచి తప్పించుకోగా.. సీఎం కాన్వాయ్ లోని వాహనాలు ఒక్కొక్కటిగా వరుసగా వచ్చి ఢీకొన్నాయి. వేగంగా వెళ్లే వాహనాలు కాబట్టి ఎంత బ్రేక్ వేసినా ఆగకుండా ఉండిపోయాయి.

దీంతో సీఎం కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాగా ఈ వెహికల్ ప్రమాదంలో స్వల్ప గాయాలతో సీఎం బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా కొంతమంది మాత్రం సీఎం వెళ్లే సమయంలో కనీసం భద్రత చూసుకోవాల్సిన అవసరం ఉందని సలహాలు ఇస్తున్నారు.

TAGS