YCP MLCs : రాజీనామాలు ఆమోదించండి… వైసీపీ ఎమ్మెల్సీల ప్లకార్డులు
YCP MLCs : తమ రాజీనామాలు ఆమోదించాలంటూ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండటిలో ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చిన తమ రాజీనామాలను ఆమోదించకుండా, ఇందుకూరి రఘురామరాజుపై అనర్హత వేటు వేశారని వారు పేర్కొన్నారు. అయితే, ఆ అనర్హత వేటును హైకోర్టు తప్పుపట్టిందని వారు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే రాజీనామాలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి మండలిలో తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.
రాజీనామాలు చేసి నెలలు గడుస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. వారు సభలోనే రాజీనామా ఆమోదం కోసం పట్టుపడుతున్నా ఛైర్మన్ హోషేన్ మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. వీరి రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. అయితే ఉప ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. వీరి దారిలో మరింత మంది ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తే మండలిలో ఉన్న ఆ కాస్త వైసీపీ బలం కూడా పోతుందని పరిశీలకులు భావిస్తున్నారు.