JAISW News Telugu

Abhishek Sharma : అభిషేక్ శర్మ వరుస ఫెయిల్యూర్.. మరో యువరాజ్ అవుతావనుకుంటే ఇలా ఏందీ బాసు

Abhishek Sharma

Abhishek Sharma

Abhishek Sharma : యువ క్రికెటర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమతున్నాడు. జింబాబ్వే సిరీస్ మొదటి మ్యాచులో సెంచరీతో కదం తొక్కిన ఈ యువ క్రికెటర్ ఆ తర్వాతి నుంచి ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా సిరీస్ లో ఈ యువ ఆటగాడు ఓపెనర్ గా బరిలోకి దిగి తక్కువ స్కోరుకు అవుటై మిగతా బ్యాట్స్ మెన్ లపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు.

డర్బన్ లోని కింగ్స్ మీడ్ లో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో కేవలం 7 పరుగులకే అవుటయ్యాడు. రెండో టీ 20 లో కూడా కేవలం 4 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో అభిషేక్ శర్మ వచ్చిన అవకాశాలను సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాడని క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. యువరాజ్ సింగ్ శిష్యుడిగా క్రికెట్ లోకి అడుగుపెట్టి అంతటి క్రికెటర్ అవుతాడనుకుంటే మధ్యలోనే ఇలా చేతులెత్తేయడం దారుణమని అంటున్నారు.

టీం ఇండియాలో ఇప్పటికే చాలా పోటీ ఉంది. అటు ఆస్ట్రేలియాతో ఏ తో ఇండియా ఏ మ్యాచులు ఆడుతుంది. ఇటు టీ  20 సిరీస్ ఆడుతోంది. నవంబర్ 19 నుంచి బోర్డర్ గవాస్కర్ సిరీస్  స్టార్ట్ కానుంది. దాదాపు మూడు టీంలు ఒక్కో చోట ఆడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోతే తర్వాత జట్టులో చోటు కోల్పోతే తిరిగి రావడం చాలా కష్టం.

పృథ్వీ షా విషయంలో ఇలాగే జరిగింది. అతడిని కూడా మరో సచిన్ టెండూల్కర్ అవుతాడని అందరూ అనుకున్నారు. పొగడ్తల వర్షం కురిపించారు. కానీ చివరకు ముంబై టీం నుంచి కూడా తీసేశారు. దీనికి అతడి ఫిట్ నెస్ ఒక కారణమైతే.. ప్రవర్తన, ఆటతీరు సరిగా లేకపోవడం, బ్యాటింగ్ లో పరుగులు చేయలేకపోవడం ప్రధాన కారణాలు. కాబట్టి యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ఇప్పటి నుంచే గేమ్ పై దృష్టి పెట్టాలి.  భారీగా పరుగులు సాధించాలి. ఫామ్ కోల్పోతే  సినీయర్ ఆటగాడు కేఎల్ రాహుల్ నే టీ 20 నుంచి పక్కనపెట్టారు. అభిషేక్ శర్మను పక్కనపెట్టడం అంత పెద్ద కష్టమేమీ కాదని గుర్తించుకోవాలి.

Exit mobile version