JAISW News Telugu

Game Changer : బాబాయ్ కు అబ్బాయ్ తోడు.. గేమ్ ఛేంజర్ సినిమాలో ‘జనసేన’

Game Changer

Game Changer

Game Changer : ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ హీరోగా చేస్తున్న సినిమా గేమ్ ఛేంజ‌ర్. ఇండియా టాప్ మోస్ట్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.  ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి.  రీసెంట్ గానే సినిమా నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ కూడా విడుదల చేశారు. ఇదంతా బాగానే ఉంది ఇంత‌కీ ఈ సినిమా షూటింగ్ ఎంత వ‌ర‌కు పూర్తయిందన్న విషయం ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది.  

తాజా స‌మాచారం ప్రకారం ఇప్పటికే సినిమా షూటింగ్  85శాతం పూర్తయినట్లు తెలుస్తోంది.  ఈ సినిమాను అక్టోబ‌ర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అంటే పోస్ట్ ప్రొడ‌క్షన్ వర్క్ కే దాదాపు ఆరు నెల‌ల సమయం పడుతుంది. శంక‌ర్ సినిమాలంటే ఆ మాత్రం టెక్నిక‌ల్ వ‌ర్క్ ఉంటుంది..  కాబ‌ట్టి ఆరు నెల‌లంటే పెద్ద టైం ఏం కాదు.  ఇక ‘గేమ్ ఛేంజ‌ర్‌’ మొత్తం ఇదో పొలిటికల్ డ్రామా. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. తండ్రీ కొడుకులుగా క‌నిపించ‌బోతున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రి  పాత్రకు రాజ‌కీయ ప‌రంగా కొన్ని నిర్ధిష్ట ఆలోచ‌న‌లు ఉంటాయి. పార్టీ స్థాపించి జనాలకు సేవ చేయాల‌నుకొంటాడు.

ఆ పార్టీకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అవి రియల్  ‘జ‌న‌సేన‌’ సిద్ధాంతాలు ద‌గ్గరగా ఉంటాయని టాక్.  జీరో బ‌డ్జెట్ రాజ‌కీయాలు, కులాల‌కు అతీతంగా రాజ‌కీయాలు చేయ‌డం, ప‌థ‌కాల‌కు మ‌హ‌నీయుల పేర్లు పెట్టడం అన్నీ  ‘జ‌న‌సేన’ సిద్ధాంతాల్లో కొన్ని. ఇలాంటివే… ‘గేమ్ ఛేంజ‌ర్‌’ సినిమాలో కూడా  క‌నిపించ‌నున్నాయ‌ట‌. చ‌ర‌ణ్ పార్టీ అజెండా, మానిఫెస్టో.. ఇవ‌న్నీ జ‌న‌సేన‌`ని గుర్తు చేసేలా ఉంటాయని తెలుస్తోంది.  ఏపీ ఎన్నిక‌ల సమయంలో రామ్ చ‌ర‌ణ్ పిఠాపురం వెళ్లి మ‌రీ పవన్ కు త‌న మ‌ద్దతు తెలిపాడు.  అది ప్రత్యక్షంగా అయితే.. `గేమ్ ఛేంజ‌ర్‌ ద్వారా ప‌రోక్షంగానూ త‌న స‌పోర్ట్ ఇస్తున్నాడన్నమాట.  ఈ సినిమాలో కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

Exit mobile version