Aaraa Mastan-Venu Swamy : ఆరా మస్తాన్.. వేణు స్వామి హై రిస్క్ ఎదుర్కొంటారా?
Aaraa Mastan-Venu Swamy : ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీల మధ్య పోటీ జరిగింది అవి వైసీపీ, కూటమిగా ఉన్న టీడీపీ. పోలింగ్ ముగిసి ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్, ముఖ్యంగా జాతీయ మీడియా కూడా మహా కూటమి గెలుపును అంచనా వేస్తుంటే, ఆరా మస్తాన్ సంస్థ మాత్రం వైసీపీ గెలుపు ఖాయమని చెప్తోంది. ఇక గతంలో సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా జగనే సీఎం అవుతారని చెప్పారు. అయితే, ఆరా మస్తాన్ గతంలో వేసిన అంచనాలు విఫలమయ్యాయి. ఒక వేళ కూటమి కనుక గెలిస్తే ఆయన 2019లో లగడపాటి రాజగోపాల్ కు పట్టిన గతే ఆరాకు పడుతుందని వాదనలు వినిపిస్తున్నాయి.
జ్యోతిష్యుల విషయానికొస్తే వైసీపీ గెలుపు ఖాయమని గట్టిగా జోస్యం చెప్పింది వేణు స్వామి. వైసీపీ గెలుపును మరి కొంత మంది జ్యోతిష్యులు చెప్తున్నా.. వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో బహిర్గతం కావడంతో వేణు స్వామిపై ఫోకస్ ఎక్కువగా ఉంది. వైసీపీ గెలిస్తే ఆరా మస్తాన్, వేణు స్వామి తమ కెరీర్ ను కొనసాగించే అవకాశం ఉంది. అవి తప్పయితే ముందుగా సోషల్ మీడియాలో ట్రోల్ కు గురవుతారు.
ఫలితాలు వెలువడడానికి ఇంకా 24 గంటల సమయం ఉండడంతో కొన్ని స్థానిక సంస్థల ఎగ్జిట్ పోల్స్, జ్యోతిష్యులు మాత్రమే వైసీపీ వైపు ఉండగా, జాతీయ మీడియా మొత్తం టీడీపీకి మద్దతు పలుకుతోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ తో ఇరు పార్టీల మద్దతుదారులు అయోమయానికి గురవుతున్నారని, తమ పార్టీలు కచ్చితంగా విజయం సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో మరికొద్ది గంటల్లో చూడాలి.