Marriage : ప్రేమ పేరుతో 4 పెళ్లిళ్లు చేసుకున్న యువతి
marriage : ప్రేమ, పెళ్లి పేరుతో నలుగురు యువకుల్ని మోసం చేసిన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. మండ్య జిల్లాకు చెందిన వైష్ణవి అనే యువతి శశికాంత్ అనే యువకుడితో గత 8 నెలలుగా ప్రేమలో ఉంది. ఇటీవల, మార్చి 24న వారు పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే వైష్ణవి అతడి నుండి రూ.7 లక్షల నగదు, 100 గ్రాముల బంగారాన్ని తీసుకుందని తెలుస్తోంది. పెళ్లి జరిగిన మరుసటి రోజే ఆమె ఆ ఆభరణాలు, నగదుతో పరారైంది.
శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇదే తరహాలో వైష్ణవి గతంలో మరో ముగ్గురు యువకులతో కూడా పెళ్లి చేసుకొని వారిని మోసం చేసినట్టు సమాచారం. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని, ఆపై ఆస్తిపాస్తులతో పారిపోతున్న ఈ యువతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.