Taiwan : తైవాన్ లో ప్రియుడి ఆత్మతో పెళ్లికి సిద్ధమైన యువతి
Taiwan : తైవాన్ లో విచిత్రమైన వివాహం జరుగనుంది. కారు ప్రమాదంలో చనిపోయిన తన ప్రియుడి ఆత్మను పెళ్లి చేసుకునేందుకు ‘యు’ అనే యువతా సిద్ధమైంది. ఈ నెల 15న జరిగిన కారు ప్రమాదంలో యు ముగ్గురిని కాపాడగా ప్రియుడిని రక్షించ లేకపోయింది. ఈ క్రమంలో అతడిని రక్షించ లేకపోయినందుకు ఆమె చాలా బాధపడింది. దీంతో అతడిపై ఉన్న ప్రేమ, అతని తల్లి ఒంటరైపోతుందని భావించిన యువతి అతని ఆత్మను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. ‘ఆత్మతో వివాహం’ అనేది మొదటిసారి వింటున్నారు కావచ్చు కానీ ఈ సంప్రదాయం చైనాలో 3 వేల ఏండ్ల నాటి నుంచి ఉంటుందని చెబుతున్నారు.
ఈ సంప్రదాయంలో చనిపోయిన వారిని వివాహం చేసుకుంటారంట. ఇలా పెళ్లి చేసుకుంటే చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఈ వివాహంలో మరణించిన వ్యక్తి ఫొటో, బట్టలు, ఇతర వస్తువులను ఉపయోగిస్తారు. ఈ పురాతన సంప్రదాయం ప్రకారం ఈ అమ్మాయి తన ప్రేమికుడి ‘ప్రేత వివాహం’ చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ‘యు’ అనే యువతి కథ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.