Mumbai : మహారాష్ట్రలోని ముంభైలో పాడైపోయిన చికెన్ తో చేసిన షవర్మ తిని ఓ యువకుడు మృతి చెందాడు. ఓ స్టాల్ లో కొనుగోలు చేసిన షవర్మ తిన్న 19 ఏళ్ల యువకుడు మృతి చెందిన నేపథ్యంలో ఇద్దరు విక్రేతలను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ షవర్మ తిన్న మరో ఐదుగురు కూడా ఫుడ్ పాయిజన్ వల్ల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
ఈ నెల 3వ తేదీన ప్రథమేశ్ భోక్సే అనే యువకుడు స్నేహితులతో కలిసి చికెన్ షవర్మ తిని ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు నుంచి కడుపునొప్పి, విపరీతంగా వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందాడు.