lover attack : మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద యువతిపై ఓ ప్రేమోన్మాది దాడి చేశాడు. ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం యువతిని హైదరాబాద్ కు తరలించారు. ఆమె ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దాడి చేసిన వ్యక్తి బెంగళూరుకు చెందిన యువకుడు చేతన్ అలియాస్ కిరణ్ అని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఏఎస్సై రుక్సానా సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు.