Poonam Kaur : బట్టలు కూడా వేసుకోలేని దారుణమైన వ్యాదికి గురైన యంగ్ హీరోయిన్!
Poonam Kaur : టాలీవుడ్ లో ఈమధ్య కొంతమంది హీరోయిన్స్ కి విచిత్రమైన వ్యాధులు సోకుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సమంత మయోసిటిస్ వ్యాధితో ఏ రేంజ్ లో బాదపడిందో మనమంతా చూసాము. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకి మానసిక ఒత్తిడి కారణంగా ఈ వ్యాధి సోకింది. ఆ తర్వాత ప్రాణాపాయ పరిస్థితి దాకా వెళ్లొచ్చి చివరికి ట్రీట్మెంట్ తీసుకొని రికవరీ అయ్యింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆమె త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఆమె లాగానే ఇప్పుడు మరో యంగ్ బ్యూటీ విచిత్రమైన రోగం తో బాదపడినట్టుగా తెలుస్తుంది. ఆమె మరెవరో కాదు రాజకీయం గా, సినిమాల పరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం ట్రెండింగ్ లో ఉండే పూనమ్ కౌర్. ఈమె ఎస్ వీ కృష్ణా రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ‘మాయాజాలం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో పూనమ్ కౌర్ క్యారక్టర్ ఆర్టిస్టుగా, లేడీ విలన్ గా పలు సినిమాల్లో నటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ జల్సా సినిమాలో అవకాశం ఇప్పిస్తాడు అంటూ నన్ను మోసం చేసాడని చెప్పుకొని వాపోయిన ఈమె, పవన్ కళ్యాణ్ మీద కూడా ఎన్నోసార్లు పరోక్షంగా సెటైర్లు విసిరినా సందర్భాలు ఉన్నాయి. అదంతా పక్కన పెడితే రీసెంట్ గా ప్రతీ రోజు ఉదయం 8 గంటలకు జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ‘ఆరోగ్యమే మహాభాగ్యము’ షో లో మంతెన సత్యనారాయణ తో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండేళ్ల నుండి ఫైబ్రోమైయాల్జియా వ్యాధితో బాధపడుతున్నానని, ఆ సమస్య వల్ల కాళ్ళు చేతులు కూడా కదపలేని పరిస్థితి ఏర్పడిందని, బట్టలు కూడా వేసుకోలేక నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది.
ఆ సమయం లో తానూ టైట్ బట్టలు వేసుకోవడం మానేశానని, లూస్ గా గాలి ఆడే బట్టలను మాత్రమే వేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అలాంటి సమయం లో న్యాచురోపతి లెజెండ్ మంతెన సత్యనారాయణ గారిని కలవడం వల్ల నా సమస్యకి పరిష్కారం దొరికిందని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. ఈ వ్యాధి నివారణ కోసం ఆయన ఇచ్చిన ఆరోగ్య సూత్రాలు తూచా తప్పకుండ అనుసరించడం వల్లే నేను ఈరోజు సురక్షితంగా బయటపడ్డాను అని చెప్పుకొచ్చింది.