JAISW News Telugu

YCP Huge Scam : జాబితాల వెనుక భారీ స్కామ్? సొంత నేతలనే పిండుతున్నారు..

YCP Huge Scam

YCP Huge Scam

YCP Huge Scam : వైసీపీలో పార్టీలో కొత్త స్కామ్ నడుస్తోందా? అంటే అవుననక తప్పదు. ఆ పార్టీ నుంచి వరుసగా విడుదలవుతున్న జాబితాల వెనుక భారీ స్కామ్ ఉందన్న గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ ఒక జాబితాలో ఉన్నవారిని మరో జాబితాలో తీసేస్తున్నారు. మరికొంత మందికి అసలు అభ్యర్థిత్వాలు ఉండవని.. చివరి క్షణంలో ఇతరులు వస్తారని సంకేతాలు ఇస్తున్నారు. దానికి ఏదో ఓ కారణం చెబుతున్నారు. అనుకున్నట్లుగా పని చేయలేకపోతున్నారు. తీసేస్తున్నామని చావు కబురు చల్లగా చెబుతున్నారు. అప్పటికే నేతలు సమర్పించుకున్నది కాక.. ఫ్లెక్సీలకు ఇతర ఖర్చులకు ఆస్తులు ఆమ్మేసుకుని ఉంటారు నేతలు. ఇలాంటి వారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు.

చిలకలూరిపేటలో మల్లెల రాజేశ్ నాయుడు అనే నేతకు ఇన్ చార్జి ఇచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు అలా ఆశ్చర్యపోయిన వారి మైండ్ బ్లాంక్ చేసేశారు. ఎందుకంటే..ఆయనకు కనీసం ఇరవై కోట్లు చిలుం వదిలించేశారని తేలిపోయింది. తనకు జరిగిన అన్యాయంపై ఆయన కార్యకర్తల సమావేశం పెట్టుకుని ఏడ్చినంత పని చేశారు. ఇక బయటకు రాని వాల్లు ఎంతో మంది. ఇప్పటి వరకూ పన్నెండు జాబితాలు రిలీజ్ చేశారు. మార్చిన వాళ్లనే మళ్లీ మళ్లీ మారుస్తున్నారు. ఆర్థికంగా బలమైన వాళ్లు అని చెప్పి సీటిస్తున్నారు. తర్వాత తీసేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కోట్లు చేతులు మారుతున్నాయి. అంతా బ్లాక్ మనీ కావడంతో ఎవరూ ఫిర్యాదుల వరకూ వెళ్లలేకపోతున్నారు.

సొంత పార్టీ నేతలను దోచుకుని ఏం సాధిస్తారన్న చర్చ వైసీపీలో బాగానే నడుస్తోంది. ఓ వైపు జాబితాల పేరుతో గందరగోళం సృష్టించుకుని పార్టీ రేసులో లేదన్న అభిప్రాయాన్ని బలపర్చుకున్నారు. మరో వైపు పార్టీ నేతలను ఆర్థికంగా కుంగదీస్తున్నారు. క్యాడర్ ను పట్టించుకోవడం లేదు. ఎలా చూసినా వైసీపీ నేతలే దోపిడీదారులనుకుంటే వారినే దోపిడీ చేస్తున్న వైనం ఆశ్చర్యమనిపిస్తోంది.

Exit mobile version