JAISW News Telugu

IRS Officer : పురుషుడిగా మారిన మహిళా ఐఆర్ఎస్ అధికారి.. సివిల్ సర్వీ్స్ చరిత్రలో మొదటి కేసు

IRS Office

IRS Officer

IRS Office : హైదరాబాద్‌లోని ఓ మహిళా ఐఆర్‌ఎస్ అధికారి తన లింగాన్ని మార్చుకున్నారు. సెంట్రల్ కస్టమ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో జాయింట్ కమీషనర్‌గా నియమితులైన ఈ మహిళా అధికారి సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీ (SRS) ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత తిరిగి తన విధుల్లో చేరారు. విధుల్లో చేరిన తర్వాత సివిల్ సర్వీస్ రికార్డుల్లో లింగమార్పిడి కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత అధికారికంగా మహిళ నుంచి పురుషుడిగా రూపాంతరం చెందింది.

అనుసూయ, 2013 బ్యాచ్‌కు చెందిన మహిళ ఐఆర్ఎస్ 11 సంవత్సరాల సేవ తర్వాత ఇప్పుడు అనసూయ.. అనుకతిర్ సూర్యగా మారిపోయారు. ఇన్నాళ్లు మహిళగా ఉన్న అనుకతిర్‌ను ఇకపై పురుషుడిగా ప్రభుత్వం పరిగణించనుంది. అన్ని అధికారిక రికార్డుల్లోనూ అనుకతిర్ సూర్యగా గుర్తిస్తారు. ఇలా జరగడంతో భారత సివిల్ సర్వీస్ చరిత్రలో కొత్త అధ్యాయం చేరింది. లింగ మార్పిడికి గురైన దేశంలోనే తొలి మహిళా ఐఆర్ఎస్ అధికారిణి ఆమె. దీనికి ముందు 2015 సంవత్సరంలో ఒరిస్సాలోని వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్నా ఒక అధికారి తన లింగాన్ని మార్చుకున్నాడు. ఆ అధికారి మగ నుంచి ఆడగా మారిపోయాడు.

సివిల్ సర్వీస్ చరిత్రలో తొలి కేసు
2014 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆమె ప్రభుత్వ రికార్డుల్లో తన లింగాన్ని కూడా మార్చుకుంది. అప్పటి నుండి ఆమెను ఐశ్వర్య ఋతుపూర్ణ ప్రధాన్ అని పిలుస్తారు. ఆ సంఘటన తర్వాత ఇది రెండవ కేసు. ఇందులో ఒక అధికారి లింగాన్ని మార్చారు. ఐఆర్‌ఎస్ అధికారి తన లింగాన్ని మార్చుకోవడం దేశ సివిల్ సర్వీస్ చరిత్రలో ఇదే తొలిసారి.

2014లో సుప్రీంకోర్టు తీర్పు
ఎం అనసూయ గుర్తింపును మిస్టర్ ఎం అనుకతిర్‌గా నమోదు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో ఇలాంటి కేసును విచారిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. ఇందులో లింగమార్పిడి అనేది ఆ వ్యక్తి వ్యక్తిగత అంశమని, అది అతని ఉద్యోగాన్ని ప్రభావితం చేయదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Exit mobile version