Team India : విన్నింగ్ కాంబినేషనా? మార్పులకే మొగ్గు చూపుతారా?
Team India : టీ20 ప్రపంచకప్ లో వరుస విజయాలతో టీమిండియా ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడిన టీమిండియా స్ఫూర్తిదాయకమైన ఆట తీరును ప్రదర్శించింది. రోహిత్ సేన 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా ఫైనల్లోకి చేరింది. శనివారం బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో తలపడనుంది.
ఈ నెల29న రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ప్రతి మ్యాచ్ లోనూ గెలుస్తూ ఫైనల్ కు చేరింది. అటు సౌతాఫ్రికా కూడా వరుస విజయాలతో ఫైనల్ ఫైట్ కు చేరుకుంది. చివరి మ్యాచ్ లో విజేతగా నిలిచే జట్టు చరిత్ర సృష్టించనున్నది.
ఒక్క మ్యాచ్ లోనూ ఓడిపోకుండా ప్రపంచకప్ అందుకున్న జట్టుగా ఫైనల్ విజేత నిలవనున్నది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇప్పటి వరకు వరుస విజయాలతో ఈ ఫీట్ సాధించిన దాఖలాలు లేవు. టీ20 ప్రపంచకప్‌ల్లో టీమిండియా, సౌతాఫ్రికా నేరుగా జరిగిన పోరులో 4-2గా ఉంది. మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో టీమిండియా నాలుగు సార్లు విజయం సాధించగా.. సౌతాఫ్రికా రెండు సార్లు విజయం సాధించింది.
దూబేపై వేటు..
11 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్‌కు టీమిండియా పకడ్బందీగా సిద్ధమవుతున్నది. సూపర్-8 నుంచి ఎలాంటి మార్పులు లేకుండా అదే కాంబినేషన్‌ను కొనసాగిస్తున్న రోహిత్ శర్మ.. చివరి మ్యాచ్ లో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. సెమీఫైనల్లో దారుణంగా విఫలమైన శివమ్ దూబేను పక్కన పెట్టి స్పెషలిస్ట్ బ్యాటర్ బ్యాట్స్ మెన్ సంజూ శాంసన్ లేదా యశస్వి జైస్వాల్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ కొంత తడబడుతున్న నేపథ్యంలో జైస్వాల్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. విరాట్ ఆట తీరు నిరాశపరుస్తున్నది.
కోహ్లీ ఫస్ట్ డౌన్..
యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి వస్తే కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయడం ఖాయం. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశాలు లేవు. జడేజా ఫామ్‌లో లేకపోయినా మ్యాచ్ విన్నర్‌గా గుర్తింపు తెచ్చుకొని జట్టులో కొనసాగగుతున్నది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లు కూడా ఆడే అవకాశం ఉన్నది. దీంతో యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్‌లకు పక్కన ఉండాల్సి వస్తుంది.
పేసర్లలో జస్ర్పీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఆడనున్నారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం పేస్ బాధ్యతల్లో భాగస్వామ్యం కానున్నాడు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చే ఉద్దేశం కెప్టెన్ రోహిత్ శర్మలో లేకుంటే మాత్రం తుది జట్టులో ఎలాంటి మార్పులు జరగకపోవచ్చు.
భారత తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా