Putin-Trump Video : భారత్ లో మండుటెండల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి అధికారంలోకి రావాలని మోదీ ఆశిస్తున్నారు. ఇక బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపుతామని ఇండియా కూటమి భావిస్తోంది. ఈక్రమంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు పూర్తికాగా, మరో ఐదు దశలు మిగిలి ఉన్నాయి. జూన్ 4న ఫలితాల వెల్లడి తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారో తెలియనుంది. ఈనేపథ్యంలో అమెరికాలో కూడా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. రెండు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాల్లో ఎన్నికలు జరుగుతుండడంతో ప్రపంచమంతా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ రెండు దేశాల్లో ఎన్నికయ్యే ప్రభుత్వాల ద్వారా ప్రపంచ రాజకీయాల్లోనూ పలు మార్పులు వచ్చే అవకాశం ఉంది.
అమెరికా 60వ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ లో జరుగనున్నాయి. డెమోక్రటిక్ పార్టీ తరపున జో బిడెన్ రెండో సారి పోటీ పడుతుండగా, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. అమెరికాలో ఇప్పటికే ప్రచారం హోరెత్తుతోంది. ఇక సోషల్ మీడియాలోనూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఎవరు గెలిస్తే ఏం చేస్తారనే దానిపై డిబేట్స్ కూడా దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఇక అమెరికన్లలో హాస్యచతురత కూడా ఎక్కువే కాబట్టి పొలిటికల్ ఫన్నీ వీడియోలు, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఓ డొనాల్డ్ ట్రంప్ పై చేసిన ఓ వీడియో అమెరికన్లను అలరిస్తోంది. ‘‘అది నేను కదా..’’ అనే క్యాప్షన్ తో వచ్చిన వీడియోలో ట్రంప్ ను, నియంత లాంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూ చేసినట్టుగా ఆ వీడియోలో నవ్వులు పూయించారు. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ నవ్వులు పూయించడమే కాదు ఓ చిన్న సైజు నియంతలా ప్రవర్తిస్తారనేది తెలిసిందే. పుతిన్ కు ట్రంప్ ఏం తక్కువ కాదు. ఆ వీడియోను ఓ పాట రూపంలో ఇంటర్వ్యూ రూపంలో రూపొందించారు. ఇప్పుడా ఆ వీడియో అమెరికన్లలో ఎంతో అలరిస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి మరి..