Viral Video : ఆ బ్లాక్ బస్టర్ పాట రాగానే మైమరిచిపోయిన పెద్దాయన.. ఏజ్ కూడా మరిచిపోయి డ్యాన్స్.. వైరల్ వీడియో

A video of a 60-year-old man dancing to a Hindi song has gone viral

A video of a 60-year-old man dancing to a Hindi song has gone viral

Viral Video : శరీరానికి వయసు అయిపోతుంది.. కానీ మనసు కాదు.. ఎంత వయసు వచ్చినా మనలోని ఆ కుర్రాతనం అలాగే ఉండాలి. ఆ ఉరిమే ఉత్సాహమే మనల్ని నడిపిస్తుంది.. ఎంజాయ్ చేసేలా చేస్తుంది. 6 పదులు వచ్చిన ఒక పెద్దాయనలోనూ తను యువకుడిగా ఉన్నప్పుడు ఊపేసిన హిందీ పాట రాగానే ఉగ్గబట్టుకోలేకపోయాడు.. ఏకంగా ఆ ఫంక్షన్ లో తన భార్యతో డ్యాన్స్ చేసి ఫిదా చేశాడు..

అమెరికాలో సిక్కు జాతీయులకు చెందిన ఒక ఫంక్షన్ జరుగుతోంది. ఇందులో ఒక సిక్కు పెద్దాయన అప్పటివరకూ టేబుల్ పై హుందాగా కూర్చున్నాడు. కానీ తన ఫేవరెట్ హిందీ పాట రాగానే అక్కడున్న డిసిప్లేన్ వాతావరణం.. కుర్రాళ్లు, ప్రముఖులు ఉన్నారన్నది మరిచిపోయాడు. తన వృద్ధాప్యాన్ని సైతం పక్కనపెట్టి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు.

ఆ హిందీ పాటకు లయబద్ధంగా ఈయన చేసిన డ్యాన్స్ అక్కడ వేదికలో ఉన్న వాళ్లంతా చప్పట్లు, హర్షధ్వానాలతో ఎంకరేజ్ చేశారు. ఈ పాట మధ్యలో తన చాలా లావుగా ఉన్న భార్యను లాగాడు. ఆమె అంత బరువుగా ఉన్నా డ్యాన్స్ చేసి అందరినీ అలరింపచేసింది.. ఇక యూత్ సైతం దీన్ని సెల్ ఫోన్లలో బంధించి వైరల్ చేశారు.

ఇప్పుడు ఈ వీడియో చూశాక.. ‘ముసలోడే కానీ మహానుభావుడు’ అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.