హెచ్‌ఐవి వ్యాక్సిన్‌కు సంబంధించి, పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం కష్టమని పరిశోధకులు చెబుూ వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ వైరస్ చాలా వేగంగా మారడమే. దీని కారణంగా టీకా శరీరంపై ప్రభావం చూపదు. ఎంఐటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లో, మొదటి మోతాదు రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రెండో మోతాదు దాని వైరస్ ప్రభావాన్ని బట్టి వారం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోస్ తో రోగనిరోధక వ్యవస్థను బలోపతం చేస్తుంది.
ముందుగా ఎలుకలపై పరిశోధన
ఈ అధ్యయనంలో ముందుగా ఎలుకలపై ప్రయోగాలు చేశారు. మొదటి మోతాదు చాలా చిన్నది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తర్వాత రెండో డోస్ కు శరీరాన్ని సిద్ధం చేస్తుందని ఎంఐటీలోని లోని జాన్ ఎం డచ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ ఎరుప్ చక్రవర్తి వెల్లడించారు. ఇందులో 7 డోసులపై పరిశోధన చేసి, ఆ తర్వాత ఈ రెండు వ్యాక్సిన్‌లను తయారు చేశారు. ఇతర వ్యాధులపై పోరాడేందు ఈ వ్యాక్సిన్ ప్రభావం చూపుతుందని తెలిపారు.
వ్యాక్సిన్ ఎలా పని చేస్తుంది?
ఏటా ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ (10 లక్షల) మందికి హెచ్ ఐవీ సోకుతున్నది. దీనికి చాలా చోట్ల యాంటీవైరల్ మందులు అందుబాటులో లేవు. కొత్త అధ్యయనంలో, ఎంఐటీ బృందం తమ పరిశోదనలో దాదాపు విజయం సాధించింది. తక్కువ మోతాదులో టీకాను ఉపయోగించడం ద్వారా ప్రభావ ఉంటుందా అనే అంశంపై తమ పరిశోధనలను సాగించింది. చివరకు రెండు డోస్ లతో వ్యాధిని నిరోధించే వ్యాక్సిన్ ను రూపొందించి వైద్యుల బృందం.