swimming pool : విషాదం నింపిన విహారం.. ఈతకొలనులో ముని ముగ్గురు యువతుల మృతి

swimming pool
swimming pool Trip : మంగళూరు సమీపంలో విషాదకర సంఘటన జరిగింది. ఉచ్చిల బీచ్ కు సమీపంలోని బీచ్ రిసార్టులోని ఈత కొలనులో మునిగి ముగ్గురు యువతులు మృతి చెందారు. మైసూరు కురుబరహళ్లి నివాసి ఎండీ నిశిత (21), రామానుజ రహదారి కేఆర్ మొహల్లా నివాసి ఎస్ పార్వతి (20), విజయనగర దేవరాజ మొహల్లా నివాసి ఎన్ కీర్తన (21)లను మృతులుగా గుర్తించారు. సెలవు ఉండడంతో శనివారం వీరు ఈ రిసార్టుకు వచ్చారు. ఆదివారం ఉదయం వీరు ఈత కొలను వద్దకు రాగా.. ఒక యువతి నీటిలో పడిపోవడంతో ఆమెను రక్షించేందుకు మిగిలిన ఇద్దరూ కొలనులోకి దిగారు. ముగ్గురూ కొలనులో నుంచి బయటకు రాలేక నీట మునిగి మృతి చెందారు. ఈత కొలనులో ఒకవైపు ఆరు అడుగుల కనకనా ఎక్కువ లోతు ఉండగా, మరో వైపు వచ్చేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలమై మృతి చెందారు. ఉళ్లాల పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.