Sandwich Tip : 7 డాలర్ల శాండ్ విచ్ కు 7వేల డాలర్ల టిప్.. చివరికి ఏం జరిగిందంటే!
Sandwich Tip : రెస్టారెంట్, బార్ లాంటి వాటిలోకి వెళ్లితే టిప్ గా ఎంతిస్తాం.. ఆ రెస్టారెంట్ ఉన్న ప్రదేశం.. లేదంటే దాని విలువ.. రిచ్ లుక్ ఇలా బేరీజు వేసుకొని ఎంతో కొంత చెల్లిస్తాం. తిన్న ఫుడ్, తాగిన డ్రింగ్ కంటే ఎక్కువ టిప్ ఇచ్చే దాదాపు ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక మహిళ 7.5 డాలర్ల (రూ. 628) ఫుడ్ తిని 7వేల డాలర్లు (రూ. 6 లక్షలకు పైగా) టిప్ ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే..
అమెరికాలోని ఇటాలియన్ సబ్ వే రెస్టారెంట్ కు ఫుడ్ తినేందుకు వెళ్లింది కానర్ అనే మహిళ. ఒక శాండ్ విచ్ ఆర్డర్ చేసింది. నిదానంగా తిన్నది. తర్వాత వెయిటర్ బిల్ తీసుకచ్చి ఇచ్చాడు. శాండ్ విచ్ కు 7.5 డాలర్లు కానీ ఆమె 7వేల డాలర్లను టిప్ గా ఇచ్చింది. అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు ఆమె గొప్ప మనసును చూసి మురిసిపోయారు. మహాతల్లి అనుకున్నారు.
కానీ తన ఫోన్ కు వచ్చిన మెసేజ్ ను చూసి ఖంగుతిన్న కానర్ వెంటనే బ్యాంకుకు పరుగులు పెట్టింది. ఆమె తన బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డును ఉపయోగించి డబ్బులు చెల్లించింది. అయితే డబ్బులు చెల్లించాల్సిన చోట తన ఫోన్ నెంబర్ లోని చివరి అంకెలను ఎంటర్ చేసింది. దీంతో భారీగా డబ్బులు రెస్టారెంట్ ఖాతాలోకి వెళ్లాయి. లబోదిబో అంటూ బ్యాంకును ప్రాదేయ పడగా వారు ససేమీరా అన్నారు. రెస్టారెంట్ వారినే వేడుకోవాలని సూచించారు.
దీంతో ఆమె మళ్లీ రెస్టారెంట్ కు వెళ్లి నిర్వాహకులను వేడుకుంది. పొరపాటున చెల్లించానని, అంత మొత్తం టిప్ కాదని, తన పాస్ వర్డ్ ఎంటర్ చేసే క్రమంలో తప్పు జరిగిందని ఆమె మొత్తుకుంది. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు నెల రోజుల తర్వాత రీ క్లయిమ్ చేసేందుకు అంగీకరించారు. దీంతో చావు తప్పి 7వేల డాలర్లు తిరిగచ్చాయి సంతోషపడింది. పాపం రెస్టారెంట్ కు మాత్రం మళ్లీ పాత టిప్పే దక్కింది.