Junior Doctors Strike : తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మెకు తాత్కాలిక బ్రేక్

Junior Doctors Strike
Junior Doctors Strike : తెలంగాణలో జూనియర్ డాక్టర్లు తాత్కాలికంగా సమ్మె విరమించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు సఫలం కావడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాము తాత్కాలికంగా మాత్రమే సమ్మె విరమిస్తున్నామని పలు అంశాలపై ప్రభుత్వం నుంచి లభించిన హామీ మేరకే తాము ప్రస్తుతానికి సమ్మె విరమించినట్టుగా జూనియర్ డాక్టర్లు ప్రకటించారు.
బుధవారం (జూన్ 26) యథావిథిగా విధులకు హాజరవుతామని తెలిపారు. అయితే రెండు అంశాలకు సంబంధించి ప్రభుత్వం బుధవారం జీవోలు విడుదల చేస్తామని చెప్పిందని, అలా కుదరకపోతే, గురువారం నుంచి తిరిగి సమ్మెను ప్రారంభిస్తామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కాగా, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా స్టైఫండ్ చెల్లింపు సహా ఎనిమిది ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు ఇటీవల సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.