Talented Actor : ఒకానొక సమయంలో వాలి, ఖుషి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో విపరీతమైన క్రేజీ సంపాదించుకున్న డైరెక్టర్ ఎస్‌జే సూర్య. అయితే నాని తర్వాత టచ్ కోల్పోయి కొమరం పులి లాంటి కొన్ని మరచిపోలేని సినిమాలు చేశాడు. కానీ, స్పైడర్, మెర్సల్ చిత్రాలతో నటుడిగా తనని తాను ఆవిష్కరించుకున్న ఆయన ఆ తర్వాత నిలకడగా మంచి నటనను కనబరిచారు. ‘మానాడు’, ‘డాన్’, ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలకు మంచి విమర్శకుల నుంచి భారీ ప్రశంసలే దక్కాయి.
ఈ వారం విడుదల కానున్న ‘రాయన్’, ‘సరిపోదా శనివరం’, ‘గేమ్ ఛేంజర్’, ‘ఇండియన్ 3’ తదితర చిత్రాల్లో ఆయన కనిపించబోతున్నాడు. రీసెంట్ గా ఇండియన్ 2లో కూడా కనిపించాడు. మితిమీరిన ఎక్స్ పోజర్ వల్ల కొన్ని నెలల్లో ప్రేక్షకుల్లో ఎస్‌జే సూర్యకు ఆదరణ తగ్గిపోతుందనే ఆందోళన ఇండస్ట్రీలో వ్యక్తం అవుతోంది.
రాబోయే సినిమాల్లో ఆయన ఉనికి ఎక్కువగా ఉండడంతో దర్శకులు వ్యూహాత్మకంగా, ఆలోచనాత్మకంగా ఆయన నటనా, దర్శకత్వ ప్రతిభను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులకు త్వరగా అలసట కలిగించే ఫార్ములా.. అనవసరమైన విలన్ పాత్రలపై ఆధారపడకుండా, వైవిధ్యమైన, ఆకర్షణీయమైన పాత్రలను సృష్టించేందుకు ప్రయత్నించాలి.
టైప్ క్యాస్టింగ్ కు దూరంగా ఉంటూ తను పోషించే ప్రతీ పాత్ర డిఫరెంట్ గా, ఛాలెంజింగ్ గా ఉండేలా చూసుకోవడం ద్వారా సూర్య కూడా ప్రేక్షకుల్లో తన అప్పీల్ ను, అభిమానాన్ని నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల వచ్చిన సరిపోదా శనివారం నాట్ ఏ టీజర్ ప్రివ్యూలో సూర్యను రాక్షస, క్రూరమైన పోలీస్ ఆఫీసర్ లా చూపిస్తూ, ఆయనకు వ్యతిరేకంగా పిడికిలి బిగించి న్యాయ పోరాటం చేసే ప్రజలు చూస్తుంటే ప్రేక్షకులను కట్టిపడేసింది. నాని, సూర్య పోషించిన రెండు పవర్ ఫుల్ పాత్రల మధ్య సంఘర్షణకు ఈ వీడియో వేదికైంది. ప్రతి సినిమాలోనూ ఫ్రెష్ గా ఉండే ఎస్‌జే సూర్యను చూస్తామని ఆశిద్దాం.