suicide attack : పాకిస్థాన్ లో ఆర్మీ పోస్టుపై ఆత్మాహుతి దాడి.. 12 మంది జవాన్లు వీరమరణం
suicide attack : పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. వాయువ్య ఖైబెర్ ఫఖ్త్యంఖ్యా ప్రావిన్స్ లోని జాయింట్ చెక్ పోస్టుపై సూసైడ్ బాంబర్ పేలుడు పదార్థాలతో కూడిన వాహనంలో దూసుకువచ్చి పేల్చేసుకోవడంతో 12 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. హోరాహోరీ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టింది.
ఆర్మీ తెలిపిన ప్రకారం.. మంగళవారం రాత్రి బన్ను జిల్లాలోని మలిఖేల్ జనరల్ ఏరియాలోని జాయింట్ చెక్ పోస్టుపై ఉగ్రవాదులు దాడికి యత్నించారు. చెక్ పోస్టులోకి ప్రవేశించాలనే వారి ప్రయత్నాన్ని బలగాలు, ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, ఆర్మీ మీడియా వింగ్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో అక్కడి ప్రహరీగోడలోని కొంత భాగం, చుట్టుపక్కల సామగ్రి ధ్వంసమైంది. 10 మంది సెక్యూరిటీ సిబ్బంది, ఇద్దరు ఫ్రాంటియర్ కానిస్టేబుల్స్ ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. గాయపడిన భద్రతా సిబ్బందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆత్మాహుతి దాడి అనంతం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.