Malkajgiri : మల్కాజిగిరి ఎంపీ బరిలో వీధి వ్యాపారి

Malkajgiri

Malkajgiri

Malkajgiri : మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో పలువురు సామాన్యులు బలమైన నాయకులతో పాటు పోటీ చేస్తున్నారు. వారిలో ఒకరు వీధి వ్యాపారం చేసుకునే చిరిపిరెడ్డి రమేశ్. తనకు జరిగిన అన్యాయాంపై పోరాటం చేసేందుకు గాను ఆయన ఎన్నికలను ఆయుధంగా ఎంచుకున్నారు.  

చిరిపిరెడ్డి రమేశ్ ఓ చిరు వ్యాపారి. హైదరాబాద్ చైతన్యపురి ప్రధాన రహదారి పక్కన ఫుట్ పాత్ పై టిఫిన్ సెంటర్ నడిపేవారు. అయితే నెల క్రితం పోలీసులు ఫుట్ పాత్ లపై చిరు వ్యాపారాలను తొలగించారు. పోలీసుల చర్య ద్వారా దాదాపు 1000 మంది చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. అందులో రమేష్ కూడా ఒకరు కావడంతో తమకు జరిగిన అన్యాయంపై పలువురు రాజకీయ నాయకులను కలిసినా ఫలితం లభించలేదు. దీంతో రమేశ్ ఆయనకు జరిగిన అన్యాయంపై ఎన్నికల బరిలో దిగాడు.

ఎన్నికల అఫిడవిట్ లో ఆయన తెలిపిన ప్రకారం అతని వద్ద రూ. 50 వేల నగదు మాత్రమే ఉంది. ఉన్న ఆ డబ్బుతోనే ప్రచారం చేస్తున్నానని, తన ప్రచారానికి స్నేహితులు, బంధువులే నిధులు సమకూరుస్తున్నారని చెప్నారు.

TAGS