Nellore District : నెల్లూరు జిల్లాలో వింత ఘటన.. పెద్దపులిని ఢీకొన్న కారు..
Nellore District : పెద్దపులి సంచారం అనగానే ఏ ఆదిలాబాద్ జిల్లానో.. లేక అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు.. శ్రీశైలం అడవులు గుర్తుకు వస్తాయి. కానీ ఇక్కడ పెద్దపులి.. సంచారిస్తున్నది తెలియగానే ఒక్కొక్కరి గుండెలు గుబేల్ మన్నాయి. ఎప్పుడు నార్మల్ గా ఉండే ప్రాంతంలో పెద్దపులి సంచారంతో ప్రజలందరూ వణికిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు జిల్లాలోని మర్రిపాడు మండలం కదిరినాయుడు పల్లె సమీపంలో ఓ కారును ఫులి ఢీకొనింది. అయితే పులికి ఈ ప్రమాదంలో గాయాలు కాగా.. కారు బానేట్ డ్యామేజ్ అయింది. కారులో ప్రయాణిస్తున్న బద్వేలుకు చెందిన అయిదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే నెల్లూరు కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు, ముంబయి హైవేపై ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో చుట్టు పక్కలా ప్రాంతాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. పులికి గాయం అయిందని అది కుంటుతూ అడవుల్లోకి వెళ్లిందని టాక్.
ఫులిని ఢీకొన్న సమయంలో కారు సడెన్ బ్రేక్ వేయడంతో దాని ప్రాణాలు కాపాడగలిగారు. కానీ వీరికి అనుకోకుండా కొన్ని గాయాలయ్యాయి. నార్మల్ గానే ఉన్న కారు లోని ప్రయాణికులు ఇలా జరగడం చూసి షాకయ్యారు. ఇలా రోడ్డు దాటే సమయంలో యాక్సిడెంట్ కావడంతో చుట్టు పక్కలా ప్రజలు వణికిపోతున్నారు.
అయితే పులులు గతంలో ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అడవులను కొట్టేయడం వల్ల గ్రామీణ సమీపప్రాంతాలకు వచ్చేవి. ఇప్పుడు కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. అయితే పులి ఎక్కడకు వెళ్లింది. ఎటు నుంచి వచ్చింది. ఏ మార్గంలో ఎటు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఈ ప్రాంతంలో కి వచ్చిందనే వివరాలు సేకరించే పని లో అటవీ శాఖ అధికారులు పడ్డారు. పెద్దపులి సంచారం వల్ల అనేక గ్రామాల్లో ప్రజలు భయపడుతున్నారు. అసలు ఈ ప్రాంతంలో పెద్ద పులి ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.