Strange Baby : వింత శిశువు.. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జననం

Strange Baby

Strange Baby

Strange Baby : నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో వింత శిశువు జన్మించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. సీతాపూర్ పరిధిలోని రేవణ్ సందా గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలకు పూనమ్ అనే మహిళ కాన్పు కోసం రాగా స్టాఫ్ నర్స్ రాజ్ కుమారి ఆమెకు పురుడుపోసింది. జన్మించిన మగబిడ్డను చూసిన నర్స్ ఒకింత ఆశ్చర్యానికి గురైంది. ఆ శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పాటు రెండు ముఖాలు కూడా ఉన్నాయి. ఇది తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వింత శిశువును చూసేందుకు బారులుదీరారు.

అయితే, పుట్టిన ఐదు గంటల తర్వాత పసిబాబు మరణించాడు. దీంతో శిశువు తల్లిదండ్రులు ఆవేదన చెందారు. కాగా, వింత శిశువు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

TAGS