Star Heroine : సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత అఫైర్స్, ప్రేమ వ్యవహారాలు వంటివి చాలా సర్వసాధారణం. బయట ప్రపంచం నుండి చూస్తున్న మనకి ఇవన్నీ కొత్తగా అనిపించొచ్చు కానీ, సినిమా ఇండస్ట్రీ వాళ్లకు ఇవన్నీ చాలా మామూలు విషయం. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే సినిమా కల్చర్ మీరెవ్వరు ఊహించని విధంగా ఉంటుంది. ఒక్కో హీరో, ఒక్కో హీరోయిన్ ఇద్దరు ముగ్గురితో అఫైర్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు.
అయితే కొంతమంది క్రిటిక్స్ మాత్రం ఇలా సినిమా ఇండస్ట్రీ లో అఫైర్స్ నడుస్తాయి అనే విషయాన్నీ అడ్డుపెట్టుకొని నోటికి వచ్చిన పుకారుని పుట్టించి పాపులారిటీ ని సంపాదించాలని చూస్తూ ఉంటారు. అలా బాలీవుడ్ లో ఉమర్ సందు అనే అతను ఉన్నాడు. ఈయన మొదట్లో చాలా పాజిటివ్ గా వార్తలు ఇచ్చేవాడు. ప్రతీ సినిమా ని విడుదలకు ముందే ఈయన చూసినట్టుగా, అద్భుతంగా ఉన్నట్టుగా చెప్పుకొచ్చేవాడు. అయితే ఈయన చెప్పినవన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. దీంతో అప్పటినుండి ఇతను తన రూట్ ని మార్చాడు.
లేనిపోనీ అఫైర్స్ ని క్రియేట్ చేసి బోలెడంత పాపులారిటీ ని సంపాదించాడు. రీసెంట్ గా ఆయన ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్, నిర్మాతకి మధ్య అక్రమ సంబంధం ఉంది అంటూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా వైరల్ అయ్యాయి. ఇక అసలు విషయానికి బాలీవుడ్ కి సమందించిన ఒక టాప్ హీరో, హీరోయిన్ కలిసి నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ సినిమా విడుదలయ్యేందుకు సిద్ధం గా ఉంది. ఈ సినిమా ప్రొమోషన్స్ ని దుబాయి లో ప్రారంభించారు. అయితే అక్కడ హోటల్ గదిలో నిర్మాత హీరోయిన్ గడిపిన ప్రైవేట్ సంఘటన మీడియా కి లీక్ అయ్యింది.
ఈ విషయం తెలుసుకున్న ఆ నిర్మాత భార్య నేరుగా దుబాయి కి చేరుకొని ఆ నిర్మాత ఉంటున్న హోటల్ రూంలోకి వెళ్లి చూడగానే అక్కడ ఆ నిర్మాత ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ ఉండడం చూసి అతని భార్య కి గుండెలు ఆగినంత పని అయ్యింది. సినిమాల్లో ఆఫర్స్ ఇప్పిస్తాను అని ఆ హీరోయిన్ ని నమ్మించాడు. నిజంగానే తానూ నిర్మించిన 7 సినిమాల్లో హీరోయిన్ అవకాశం ఇచ్చాడు. ఆ 7 సినిమాలు కూడా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. భార్య కి తెలిసిపోయినా కూడా ఇప్పటికీ ఆ హీరోయిన్ తోనే రిలేషన్ లో ఉన్నాడట ఆ స్టార్ నిర్మాత.