Kanna Laxminarayana : అమరావతిలో కాపుల ఆత్మీయ సమావేశం – పాల్గొన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

Kanna Lakshminarayana
Kanna Lakshminarayana : అమరావతి మండల కేంద్రంలోని శ్రీ సత్య సాయి కళ్యాణ మండపంలో ఈరోజు కాపుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు.
అమరావతి పట్టణం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలకు చెందిన కాపులు పెద్ద సంఖ్యలో ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు ప్రణాళికా బద్దంగా ప్రచారం చేసి భాష్యం ప్రవీణ్ భారీ మెజార్టీతో విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. సూపర్-6 పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అనంతరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ అత్యధిక ఓట్లతో తనను గెలిపించడానికి శాయశక్తులా కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో కాపు కులస్థులు పాల్గొన్నారు.