Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అంటేనే ఇప్పుడు స్కోరు 250 అయిందా.. లేదా 270 అయినా కొట్టారా అని ఎవరైనా అడుగుతున్నారు. అదేంటీ 20 ఓవర్లలో అంత స్కోరా అని ఇంతకు ముందు ముక్కన వేలేసుకునే వారు. కానీ సన్ రైజర్స్ టీం కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది.
ఈ సీజన్ లో ఇప్పటి వరకు 250 ప్లస్ స్కోరు మూడు సార్లు చేసింది. మరో మ్యాచ్ లో 9.4 ఓవర్లలో 162 పరుగులు చేసింది. రెండు సార్లు 200 పరుగుల పైన చేసి టీం అంటే ఇది టీ 20 గేమ్ అంటే ఇదని నిరూపించింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. గుజరాత్ తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో చెరో పాయింట్ వచ్చింది. దీంతో ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్ కు వచ్చేసింది.
దీంతో సన్ రైజర్స్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ కామెంటేటర్లు సన్ రైజర్స్ పై విషం కక్కారు. ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్ జట్టు వెళ్లదన్నారు. ఇండియా టీం లో మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరదని విమర్శించాడు. . ఆర్సీబీ, చెన్నై, కోల్ కతా, రాజస్థాన్ లు చేరతాయని అన్నారు. మరో క్రికెట్ కామేంటర్ హర్ష బోగ్లే కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం లేదని చెప్పాడు.
కానీ వీరి అంచనాలను తలకిందులు చేస్తూ సన్ రైజర్స్ గేమ్ చేంజర్ గా మారింది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించి శభాష్ అనిపించుకుంది. వీరికి తోడు జియో సినిమా కూడా ప్లే ఆఫ్స్ చేరే నాలుగు జట్ల ఫొటోలో సన్ రైజర్స్ లేకుండానే పోస్టు చేసింది. దీంతో జియో సినిమాపై ట్రోలర్స్ నిప్పులు చెరిగారు. ఆర్సీబీ ఏ విధంగా ప్లే ఆఫ్స్ చేరుతుందో మీకే తెలియాలి.. మరీ ఇంత వివక్ష పనికిరాదని ట్రోలర్స్ జియో సినిమాకు, మాజీ క్రికెటర్లకు గడ్డి పెట్టారు.