JAISW News Telugu

Single Lemon : ఒక్క నిమ్మకాయ రూ.35వేలు..ఇది మాములుది కాదు భయ్యా!

Single Lemon

Single Lemon

Single Lemon  Cost : నిమ్మకాయ రెండు లేదా మూడు రూపాయలకు అమ్ముతుంటారు. ఒక్కొక్కసారి సీజన్ లో ఐదారు రూపాయల దాక అమ్ముతుంటారు. కానీ ఆ నిమ్మకాయ ఏకంగా రూ.35వేలకు విక్రయించబడింది. ఒక్క నిమ్మకాయకు అన్ని రూపాయలే అని మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ..ఇది నిజమే ఒక్క నిమ్మకాయను రూ.35వేలకు ఓ వ్యక్తి కొన్నాడు. కానీ మార్కెట్ లో కాదు సుమా..శివయ్య ఆలయంలో జరిగిన వేలంపాటలో..ఈ నిమ్మకాయ కథేంటో ఒక్కసారి చదివేద్దామా మరి…

సాధారణంగా దేవుళ్ల పూజల్లో వాడిన వస్తువులను వేలం వేస్తుంటారు. వాటిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. వాటితో తమ రాత మారిపోతుందని నమ్ముతారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా లడ్డూ వేలం చూసే ఉంటాం. బాలాపూర్ లడ్డూ వంటిదైతే దాదాపు రూ.20లక్షల దాక అమ్ముడుపోతుంటుంది. దాదాపు ప్రతీచోట గణేష్ పూజలో వాడిన లడ్డూలు, దండలు, ఇతర వస్తువుల వేలం వేస్తుంటారు. వీటిని భక్తులు అందరి కంటే ఎక్కువ ధరకు పాట పాడి సొంతం చేసుకుంటారు. వీటి ద్వారా తమకు కలిసి వస్తుందని, లక్ష్మిని తెస్తుందని భావిస్తుంటారు.

ఇలాంటి నమ్మకమే ఇక్కడి భక్తులకు ఉంది. తమిళనాడులోని ఈరోడ్ కు 35 కి.మీ. దూరంలోని శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో ఈ వేలంపాట నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శివుడికి సమర్పించిన నిమ్మకాయ, పండ్లతో పాటు ఇతర వస్తువులను ఆచారం ప్రకారం వేలం వేశారు. ఈ వేలంలో 15 మంది భక్తులు పాల్గొనగా, ఈరోడ్ కు చెందిన ఓ భక్తుడు రూ.35వేలకు నిమ్మకాయను దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పూజారి స్వామి వారి ముందు ఉంచి పూజ చేసి వందలాది భక్తుల సమక్షంలో వేలం దక్కించుకున్న భక్తుడికి అందజేశారు.

ఒక్క నిమ్మకాయ రూ.35వేలకు వేలంపాటలో అమ్ముడుపోవడం ప్రజలు ఆశ్చర్యపోయారు. కానీ ఆ భక్తుడు రూ.35వేలకు కొన్న ఆనందంగానే ఉన్నాడు. తనకు ఆ శివయ్య దానికి వందింతలు ఐశ్వర్యాన్ని అందిస్తాడని సంబురపడిపోతున్నాడు. నిమ్మకాయ రూ.35వేలకు అమ్ముడుపోవడం దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుండడం విశేషం.

Exit mobile version