Contract employees : తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులకు షాక్.. క్రమబద్ధీకరణ జీవోను రద్దు చేసిన హైకోర్టు

Court
Contract employees : కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ గత రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను హైకోర్టు కొట్టేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లను పలువురు నిరుద్యోగులు దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిందని పిటిషన్ లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. జీవో 16 ద్వారా 5000 మందికి పైగా కాంట్రాక్టు లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన సెక్షన్ 10ఏ రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేస్తూ జీవోను రద్దు చేసింది.