MLA Bandla Krishnamohan Reddy : కాంగ్రెస్ కు షాక్.. సొంతగూటికి చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

MLA Bandla Krishnamohan Reddy
MLA Bandla Krishnamohan Reddy : రెండో విడత రైతు రుణమాఫీ వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన ఇరవై రోజుల క్రితం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే, ఆ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది తమ పార్టీలోకి వస్తారని అధికార కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా ఈ పరిణామం జరగడం గమనార్హం. ఇది బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తోంది.