JAISW News Telugu

Congress : ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్.. పార్టీ అకౌంట్లు సీజ్.. తిరిగి గంటలోనే..

Congress

Congress

Congress : ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన అనుబంధ సంఘాల అకౌంట్లను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది. పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన మొత్తం 9 అకౌంట్లను ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం సీజ్ చేసింది. ఆదాయ పన్ను శాఖ పంపిన నోటీసులకు సదరు అనుబంధ సంఘాలు సరైన స్పందన ఇవ్వకపోగా.. జరిమానా కూడా చెల్లించలేదని.. దీంతో అకౌంట్లు సీజ్ చేసినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.

2018-19 లో ఆదాయ పన్ను శాఖ విధించిన జరిమానా, నోటీసులకు ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు స్పందించ లేదని ఆదాయపన్ను శాఖ తెలిపింది. అకౌంట్లు సీజ్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ విభాగాలకు సమాచారం పంపింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతోంది. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్పందింప జేయడమేంటని కోశాధికారి అజయ్ మాకెన్ ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లోని క్రౌడ్ ఫండింగ్ డబ్బును సైతం సీజ్ చేశారన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం లేదని.. అది సీజ‌కు గురైందని అజయ్ మాకెన్ అన్నారు. అయితే గంటలోనే కాంగ్రెస్ పార్టీకి ఊరటనిస్తూ.. ఇన్ కం ట్యాక్స్ సీజ్ చేసిన అకౌంట్లను ఉపయోగించుకునేందుకు ఐటి అప్పిలియేట్ ట్రిబ్యునల్ అనుమతించింది.

Exit mobile version