TDP MP Candidate : పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ రాజకీయాలను టీడీపీ ఎంపీ అభ్యర్థి ఒకరు తనవైపు తిప్పుకున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో ఏకంగా రూ.5 వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఇది దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ ను చంద్రబాబు ప్రకటించిన నాటి నుంచి విస్తృతంగా ప్రచారంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు.
ఈరోజు చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో తన కుటుంబానికి రూ. 5,785 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలిచారు. చరాస్తుల విలువ రూ. 5,5,98.65 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఆయనకు రూ. 1,038 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. వృత్తి రీత్యా వైద్యుడు అయిన చంద్రశేఖర్ అమెరికాలో సుదీర్ఘంగా వైద్య వృత్తిలో కొనసాగారు. వైద్య వృత్తితో పాటు వివిధ వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు.