JAISW News Telugu

Bhashyam Praveen : పెద్దకూరపాడులో దూసుకెళుతున్న ‘భాష్యం ప్రవీణ్’.. గెలుపు పక్కా..!

Bhashyam Praveen

Nara Lokesh and Bhashyam Praveen

Bhashyam Praveen : ఏపీలో ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ఇక అందరూ ప్రచార రణరంగంలోకి దూకనున్నారు. మొన్నటి దాక ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో సీట్ల కోసం ఎంత పోటీ ఉందో చూశాం. అత్యంత పోటీలో గెలుపు గుర్రాలను టీడీపీ అధినేత చంద్రబాబు తమ అభ్యర్థులుగా ప్రకటించారు. మిగతా ఆశావహులకు సర్దిచెప్పి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పటి వరకు భాష్యం ప్రవీణ్ అనే పేరు పెద్దగా ఎవరికీ తెలియదనే అనుకోవాలి. కొన్నాళ్లుగా టీడీపీ టికెట్ల రేసులో మాత్రం ఉన్నారనేది గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలకు మాత్రమే తెలుసు. టీడీపీ అధినేత చంద్రబాబు 34మందితో కూడిన రెండో జాబితాలో భాష్యం ప్రవీణ్ కు సీటు దక్కింది.

ఈయనను ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీకి రంగంలోకి దింపారు. జిల్లాలోనే కాదు ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి ఉన్న కీలక నియోజకవర్గం అయిన పెదకూరపాడు సీటు దక్కించుకున్న భాష్యం ప్రవీణ్ పేరు ఏపీ అంతటా మార్మోగిపోతోంది.

గుంటూరు జిల్లాలో ఉన్న సీనియర్ నేతలు, రాజకీయ ఉద్దండులతో పాటు సీటు దక్కించుకున్న ప్రవీణ్ ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ లీడర్ గా తెరమీదకు వచ్చారు. స్థానికంగా ఉన్న యూత్ లో ఈయనకు మంచి సంబంధాలు ఉండడం కూడా కలిసి రానుంది.

‘భాష్యం’ విద్యాసంస్థల అధినేతకు ప్రవీణ్ బంధువు. పలు వ్యాపారాల్లో కూడా ప్రవీణ్ పెట్టుబడులు పెట్టారు. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి స్థానంలో ఉన్నారు. గత ఐదేండ్ల నుంచి ఆయన రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. చాలా తక్కువ సమయంలోనే తన వ్యాపార రంగంలో సక్సెస్ అయిన ప్రవీణ్.. ఇటు టీడీపీలో కూడా చాలా వేగంగా ఎదగడంతో పాటు చంద్రబాబు లోకేశ్ దగ్గర మంచి మార్కులు వేయించుకున్నారు.

ముఖ్యంగా టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ కు ప్రవీణ్ అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. నారా లోకేశ్ పిలుపు నిస్తే చాలు.. నేనున్నానంటూ కార్యక్రమాలను విజయవంతంగా చేపడుతుంటారు. మొదట్లో ప్రవీణ్ చూపు చిలకూరిపేటపై ఉండేది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తన సాయం కోరి ఎవరు వచ్చినా కాదనకుండా తనవంతుగా వారికి అండగా ఉండడం ఆయన స్పెషాలిటీ. ఇదే ఆయన్ను పేదల మనిషిగా, సేవా గుణం ఉన్న యువనేతగా నిలిపింది. దీనిపై నారా లోకేశ్ నుంచి కూడా అనేక సందర్భాల్లో ప్రశంసలు అందుకున్నారు.

జిల్లాలో యువగళం నిర్వహించినప్పుడు ప్రవీణ్.. సర్వం తానే అయి వ్యవహరించారు. అంతే కాదు పార్టీ కార్యకర్తల సహాయనిధికి కూడా రూ.73 లక్షల విరాళం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. ఇవన్నీ నారా లోకేశ్ ను ఆకట్టుకున్నాయి. ఈక్రమంలోనే గట్టి పోటీ ఉన్న నియోజకవర్గం నుంచి సీటు దక్కించుకోగలిగారు. యువతను, పేదలను ఆకట్టుకోవడంలో ప్రవీణ్ ముందుంటారు. అదే ఇప్పుడు ఆయన బోనస్ కానుంది. ప్రస్తుతం పెదకూరపాడు టికెట్ కేటాయించడంతో భాష్యం ప్రవీణ్ పొలిటికల్ జర్నీ సక్సెస్ ఫుల్ గా  ప్రారంభంకానుంది. ఈ స్థానం నుంచి భాష్యం ప్రవీణ్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని అక్కడి ప్రజల నాడీని బట్టి తెలుస్తోంది.

Exit mobile version