JAISW News Telugu

Viral Video : ఒక్క వీడియోతో కోట్లు సంపాదించిన స్కూల్ టీచర్

Viral Video

Viral Video

Viral Video : సినిమాలు, టీవీ అంటే కొందరు మాత్రమే స్టార్లు అవుతారు. అదే సోషల్ మీడియాలో సామాన్యుడి నుంచి ధనికుల వరకు ఎవరైనా స్టార్లు కావొచ్చు. ఎవరు ఎప్పుడు పాపులర్ అవుతారో తెలియదు. కిస్మత్ బాగుంటే ఒక్క వీడియోతో లక్షలు సంపాదించవచ్చు. ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో తెలియదు. అది వైరల్ అయ్యిందా ఇక జనాల్లోకి చొచ్చుకుని వెళ్తూనే ఉంటుంది. సోషల్ మీడియాకు ఉన్న పవర్ అది.

ఇలాంటిదే ఓ ఉపాధ్యాయుడి జీవితంలోనూ జరిగింది. ఆరేళ్ల క్రితం ఆ ఉపాధ్యాయుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ‘‘యాపిల్..యాపిల్’’ అనే సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బిక్కి శ్రీనివాసులు అనంతపురంలోని కళ్యాణదుర్గ మండలం ఎంపీపీ స్కూల్ లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈయన తన స్టూడెంట్స్ కు పాటలు, నటన ద్వారా ఇంగ్లిష్ నేర్పిస్తుంటాడు. పాటల ద్వారా నేర్పించడం వల్ల పిల్లలు త్వరగా నేర్చుకుంటారని..అలాగే వినోదం లభిస్తుందని శ్రీనివాసులు ఆలోచించి.. ఆరేళ్ల క్రితం యాపిల్ యాపిల్ రెడ్ రెడ్ అనే పాటను రూపొందించారు.

ఈ పాట యాపిల్, అరటి వాటి రంగు, రుచిని వివరిస్తూ రూపొందించబడింది. దాన్ని చిన్నారులకు పాడి వీడియో తీసి యూట్యూబ్ లో షేర్ చేశాడు. ఈ సాంగ్ కాస్త వైరల్ కావడంతో ఏకంగా 189 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ ఉపాధ్యాయుడు కోట్లు రాబట్టినట్టు సమాచారం. అలాగే బటర్ ఫ్లై సాంగ్ రూపొందించి యూట్యూబ్ లో పెట్టగా 1.1 కోట్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా బిక్కి శ్రీనివాసులుకు యూట్యూబ్ లో 50 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లు ఉండడం విశేషం.

Exit mobile version