Uday Nagaraju : యూకే పార్లమెంటు బరిలో తెలంగాణ వాసి

UK Future MP Contender Uday Nagaraju
Uday Nagaraju : యూకే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ పోటీలో నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చుందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నుంచి లేబర్ పార్టీ ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. శనిగరం గ్రామంలో ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి.
బ్రిటన్ లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చేశారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ప్రపంచం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్ ట్యాంక్ ని నెలకొల్పారు.
సర్వే ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఉదయ్ గెలిచే అవకాశాలు ఎక్కువా ఉన్నాయని పేర్కొంటున్నారు. నాగరాజు ఉదయ్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు బంధువు. తమ మండలవాసి యూకే పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.