
Chandrababu residence
Chandrababu residence : గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం దగ్గర కొండచిలువ కలకలం రేపింది. మీడియా పాయింట్ కు సమీపంలో ఏదో జంతువును మింగి చనిపోయి ఉంది. దానిని గమనించిన కొందరు భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడి నుంచి దానిని తొలగించారు. కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండడంతో పాములు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొండచిలువ కూడా ఇలా రోడ్డుపైకి వచ్చి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఆకలితో ఏదో జంతువును మింగడంతో ఇబ్బందిపడి చనిపోయిందని అంటున్నారు. గతంలో కూడా చంద్రబాబు ఉండవల్లి నివాసం దగ్గర కొండచిలువలు కనిపించిన ఘటనలు ఉన్నాయి.