Bigg boss 8 : ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ.. బిస్ బాస్ లో టాస్క్ తో హీటెక్కిన పోటీ
Bigg boss 8 : బిగ్ బాస్ లో కంటెస్టెంట్ ల మధ్య మొదటి వారంలోనే గొడవలు ప్రారంభం అయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ ను మూడు గ్రూపులుగా విభజించారు. నైనిక, యష్మీ, నిఖిల్ టీంలుగా విడగొట్టాడు. కాగా ఎవరూ గొప్ప అనే విషయాన్ని తేల్చుకోవాలని ఫిటింగ్ పెట్టాడు.
యష్మీ, నైనిక టీం మధ్య గేమ్ పెట్టగా.. ఎవరూ గెలిస్తే వారు నిఖిల్ టీం నుంచి ఒక సభ్యుడిని తీసుకోవాలని అనే ఆఫర్ ఇవ్వగా.. మొదటి ఎపిసోడ్ లో ఫస్ట్ టాస్క్ లో యష్మీ సులభంగా గెలవగా.. నిఖిల్ టీం నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.
కాగా మరో వైపు కంటెస్టెంట్ లు తెగ తిట్టుకుంటున్నారు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముగ్గురు చీప్ లను నియమించిన బిగ్ బాస్ వారి మధ్య పోటీ పెట్టాడు. తాజాగా ప్రోమోలో ఇద్దరి దోస్తుల మధ్య చిచ్చు పెట్టగా.. ముందు నుంచి హౌస్ వచ్చిన వెంటనే స్నేహితులుగా మారిపోయారు.
ఇక యష్మీ చీఫ్ కావడానికి నిఖిల్ అని తెలిసిందే. నిఖిల్ మాత్రం యష్మీ చీఫ్ కావాలంటూ మరో టీం చీఫ్ నైనికను ఒప్పించాడు. దీంతో నిఖిల్, నైనికతోపాటు యష్మీ కూడా చీఫ్ గా ఎంపికైంది. కానీ ప్రస్తుతం ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా మారిపోయింది. టాస్క్ లో నిఖిల్, యష్మీ మధ్య హాట్ హాట్ డిస్కషన్ జరిగింది.
శరీరాల మీదుగానే రింగ్స్ ఓవైపు నుంచి మరోవైపుకు చేరవేయాల్సిన టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చాడు.
యష్మీ టీం రింగ్స్ అన్నింటిని శరీరం మొత్తాన్ని తిప్పి తీసుకెళ్లగా.. నైనిక టీం మాత్రం శరీరం మొత్తం తిప్పకుండా పైపైనే అనేసి తీసుకెళతారు. కాగా ఇదే విషయం పై నిఖిల్, యష్మీ కి మధ్య గొడవ జరుగుతుంది. యష్మీ మాత్రం నిఖిల్ రూల్స్ బ్రేక్ చేస్తున్నాడంటూ ఫైర్ అవుతుంది.