వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ కడప జిల్లా, నాగసానిపల్లె గ్రామానికి చెందిన గంగయ్య రైతు. తన పొలంలోని భూమికి విద్యుత్ తీగలు తగులుతూ వెళ్తుండడంతో సాగు చేయడం సమస్యగా మారింది. పని చేసినప్పుడల్లా అతని కుటుంబం చెక్క కర్రలతో కేబుళ్లను ఎత్తి వ్యవసాయం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని మూడేళ్లుగా విద్యుత్ శాఖ అధికారులు, రాజకీయ నాయకులను ఆయన కోరారు. అయితే వారెవరూ ఈ సమస్యపై స్పందించ లేదు. ఈ ఘటన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఇదీ ఆయన పాలనలో సొంత జిల్లా ప్రజల దయనీయ పరిస్థితి.
ఇటీవల గంగయ్య తీగలు ఎత్తి సాగు చేయడం కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేశారు. ఇలా ఈ వీడియో మంత్రి గొట్టిపాటి దృష్టికి వచ్చింది. సమస్యను పరిష్కరించాలని వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించారు. మూడు గంటల్లోనే అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సమస్య పరిష్కరించారు. ఈ రకమైన చురుకైన పాలనతో చంద్రబాబు అండ్ కో.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందుతుంది.