Proper government : మూడేళ్ల సమస్య.. మూడు గంటల్లో పరిష్కారం.. సరైన ప్రభుత్వం అంటే ఇదే..

Proper government : క్రియాశీల ప్రభుత్వం ఉంటేనే ప్రజా సమస్యలు వీలైనంత వేగంగా పరిష్కారం అవుతాయి. కొన్నేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య పాలనతో విసిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఏడాది ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఊహించినట్లుగానే చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నెలలోనే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రజలతో మమేకమై సమస్యలకు వేగంగా పరిష్కారం చూపుతున్నారు. ఇటీవల ఓ రైతు మూడేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మూడు రోజుల్లో పరిష్కారం చూపి రైతు కళ్లల్లో ఆనందం చూశారు.

వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ కడప జిల్లా, నాగసానిపల్లె గ్రామానికి చెందిన గంగయ్య రైతు. తన పొలంలోని భూమికి విద్యుత్ తీగలు తగులుతూ వెళ్తుండడంతో సాగు చేయడం సమస్యగా మారింది. పని చేసినప్పుడల్లా అతని కుటుంబం చెక్క కర్రలతో కేబుళ్లను ఎత్తి వ్యవసాయం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని మూడేళ్లుగా విద్యుత్ శాఖ అధికారులు, రాజకీయ నాయకులను ఆయన కోరారు. అయితే వారెవరూ ఈ సమస్యపై స్పందించ లేదు. ఈ ఘటన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఇదీ ఆయన పాలనలో సొంత జిల్లా ప్రజల దయనీయ పరిస్థితి.

ఇటీవల గంగయ్య తీగలు ఎత్తి సాగు చేయడం కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేశారు. ఇలా ఈ వీడియో మంత్రి గొట్టిపాటి దృష్టికి వచ్చింది. సమస్యను పరిష్కరించాలని వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించారు. మూడు గంటల్లోనే అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సమస్య పరిష్కరించారు. ఈ రకమైన చురుకైన పాలనతో చంద్రబాబు అండ్ కో.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందుతుంది.

TAGS